మారుమూల గ్రామాలకూ పథకాల ఫలాలు

ABN , First Publish Date - 2022-05-19T13:04:44+05:30 IST

రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలైనా, కేంద్రప్రభుత్వ పథకాలైనా వాటి ఫలాలు మారుమూల గ్రామాల ప్రజలకు కూడా అందేలా అధికారులు కృషి చేయాలని

మారుమూల గ్రామాలకూ పథకాల ఫలాలు

                          - అధికారులకు సీఎం ఆదేశం


చెన్నై: రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలైనా, కేంద్రప్రభుత్వ పథకాలైనా వాటి ఫలాలు మారుమూల గ్రామాల ప్రజలకు కూడా అందేలా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆదేశించారు. కేంద్రప్రభుత్వ పథకాలను జిల్లా స్థాయిలో సక్రమంగా అమలు చేయడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కొన్ని విధివిధానాలను రూపొందించడంతోపాటు నిఘా పర్యవేక్షక కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ విధివిధానాల మేరకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ నాయకత్వంలో సమైక్యాభివృద్ధి పర్యవేక్షక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ తొలి సమావేశం సచివాలయం సమీపంలో నామక్కల్‌ కవింజర్‌ మాళిగై హాలులో బుధవారం ఉదయం జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి మట్లాడుతూ డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు మంత్రులతో కలిసి అధికారులు కూడా కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఏ ప్రభుత్వమైనా మారమూల గ్రామాల్లోని ప్రజలకు కూడా అభివృద్ధి పధకాల ఫలితాలు అందినప్పుడే ప్రజాప్రభుత్వమవుతుందన్నారు. అన్ని జిల్లాల్లో గ్రామాల్లో వైద్య, విద్యా సదుపాయాలు విస్తరింపజేయాలని, తమ ప్రభుత్వం ప్రస్తుతం ఈ రెండు రంగాలపైనే ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. ఇదే విధంగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలించే దిశగా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అన్ని గ్రామాలలో తాగునీటి సదుపాయం కల్పించాలని, ప్రభుత్వ పాఠశాల్లో అందరికీ విద్య పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మంత్రి పెరియకరుప్పన్‌, ప్రభుత్వ ప్రధనా కార్యదర్శి ఇరై అన్బు, ఎంపీలు, ఎమ్మెల్యేలలు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T13:04:44+05:30 IST