ప్రధానిపై విమర్శలొద్దు: Cm Stalin
ABN , First Publish Date - 2022-05-26T15:33:32+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం చెన్నై రానుండడంతో సోషల్ మీడియాలో ఆయనను విమర్శించరాదని డీఎంకే శ్రేణులకు ముఖ్యమంత్రి స్టాలిన్ సూచించారు.

ఐసిఎఫ్(చెన్నై): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం చెన్నై రానుండడంతో సోషల్ మీడియాలో ఆయనను విమర్శించరాదని డీఎంకే శ్రేణులకు ముఖ్యమంత్రి స్టాలిన్ సూచించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వివిధ పథకాలు ప్రారంభించేందుకు ప్రధాన మంత్రి గురువారం నగరానికి రానున్నారు. 2014లో మోదీ ప్రధాని అయినప్పటి నుంచి ఆయన రాష్ట్రానికి వచ్చిన ప్రతి సారి డీఎంకే శ్రేణులు ఆయనను విమర్శిస్తున్నారు. ఈసారి నగరానికొస్తున్న ప్రదానిపై విమర్శలొద్దుని ముఖ్యమంత్రి తమ పార్టీ శ్రేణులకు సూచించారు.