సీఎం ఇంటికి బాంబు బెదిరింపు
ABN , First Publish Date - 2022-05-24T16:21:52+05:30 IST
ముఖ్యమంత్రి ఇంటిని బాంబులతో పేల్చి వేస్తామంటూ బెదిరించిన తెన్‌కాశి జిల్లాకు చెందిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక ఎగ్మూర్‌లోని పోలీస్ కంట్రోల్

పెరంబూర్(చెన్నై): ముఖ్యమంత్రి ఇంటిని బాంబులతో పేల్చి వేస్తామంటూ బెదిరించిన తెన్‌కాశి జిల్లాకు చెందిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక ఎగ్మూర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఆదివారం ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ఘర్షణకు సంబంధించి తగిన చర్యలు తీసుకోలేదని, అందువల్ల ముఖ్యమంత్రి ఇంట్లో బాంబులు పెట్టినట్టు పేర్కొన్నాడు. దీంతో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ నిపుణులతో హూటాహుటిన సీఎం ఇల్లు, కార్యాలయానికి వెళ్లి తనిఖీలు చేపట్టి అది ఫేక్ కాలని నిర్ధారించారు. తెన్‌కాశి జిల్లా ఆళ్వార్‌కురిచ్చి గ్రామానికి చెందిన ఆరోగ్యరాజ్ మద్యం మత్తులో ఆ కాల్ చేసినట్లు గుర్తించారు. అతడిని అరెస్టు చేశారు.