నేటితో CM క్వారంటైన్‌ పూర్తి

ABN , First Publish Date - 2022-01-17T17:00:01+05:30 IST

కోవిడ్‌బారిన పడ్డ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పూర్తిగా కోలుకున్నారు. ఆయన క్వారంటైన్‌ అవధి సోమవారంతో ముగియనుంది. అయినా వైద్యుల సూచన మేరకు మరికొద్ది రోజులు ఆయన ముఖ్యమైన సమావేశాల్లో

నేటితో CM క్వారంటైన్‌ పూర్తి

                      - కరోనా నుంచి కోలుకున్న బొమ్మై


బెంగళూరు: కోవిడ్‌బారిన పడ్డ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పూర్తిగా కోలుకున్నారు. ఆయన క్వారంటైన్‌ అవధి సోమవారంతో ముగియనుంది. అయినా వైద్యుల సూచన మేరకు మరికొద్ది రోజులు ఆయన ముఖ్యమైన సమావేశాల్లో మాత్రమే పూర్తి జాగ్రత్తలు తీసుకుని హాజరు కానున్నారు. ఈ నెల 10న సిఎం బసవరాజ బొమ్మైకు కొద్దిగా జ్వరం దగ్గు లక్షణాలు కనిపించడం తో వైద్యపరీక్షలు జరుపుకోగా కరోనా పాజిటివ్‌ వెలుగు చూసిన సంగతి విదితమే. వైద్యుల సూచన మేరకు ఆయన మణిపాల్‌ ఆసుపత్రిలో ఒక రోజు చికిత్స పొందారు. అనంతరం బెంగళూరులోని తన నివాసంలోనే హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. తాజాగా సిఎంకు మళ్ళీ కరోనా వైద్యపరీక్షలు నిర్వహించగా నెగిటి వ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. వారం రోజులుగా సీఎం క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. ఎవర్నీ ప్రత్యక్షంగా కలుసుకోవడం లేదు. క్వారంటైలో ఉంటూనే వర్చువల్‌ సమావేశాల్లో పాల్గొంటున్నారు.

Read more