దావోస్ నగరంలో రోజంతా Cm బిజీ

ABN , First Publish Date - 2022-05-24T18:02:52+05:30 IST

దావోస్ నగరంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఎడతెరిపిలేని సమావేశాలతో బిజీగా గడిపారు. జుబిలియెంట్‌ ఫుడ్‌పార్క్‌ దేవనహళ్లిలోని 10 ఎకరాల్లో తన ఆర్‌ అండ్‌ డీ

దావోస్ నగరంలో రోజంతా Cm బిజీ

బెంగళూరు: దావోస్ నగరంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఎడతెరిపిలేని సమావేశాలతో బిజీగా గడిపారు. జుబిలియెంట్‌ ఫుడ్‌పార్క్‌ దేవనహళ్లిలోని 10 ఎకరాల్లో తన ఆర్‌ అండ్‌ డీ విభాగాన్ని ప్రారంభించేందుకు సీఎంతో చర్చించిన అనంతరం నిర్ణయించింది. సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో ఇప్పటికే 9వేల మంది ఈ సంస్థలో పనిచేస్తున్నట్టు సీఎం తెలిపారు. హిటాచి ఎనర్జీ సంస్థ ప్రముఖులతోనూ సీఎం కీలక చర్చలు నిర్వహించారు. ఎలకా్ట్రనిక్‌ వాహనాలకు క్రమేపీ డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో దొడ్డబళ్లాపురలో ఇ-చార్జింగ్‌ మౌలిక సదుపాయాల కోసం ఓ ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించాలని సంస్థ తీర్మానించింది. బెంగళూరులో కొత్తగా రెండు ప్రాజెక్టులను చేపట్టేందుకు సీమెన్స్‌ సంస్థ అంగీకరించింది. మ్యాగ్నెటిక్‌ ఇమేజింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్‌ ఆధారిత పరిశోధనా కేంద్రాన్ని కూడా ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. బొమ్మసంద్రలో సెప్టెంబరు నెలలో శంకుస్థాపాన చేయాలని నిర్ణయించారు. బియాండ్‌ బెంగళూరు పథకంలో భాగంగా తుమకూరు, హుబ్బళ్లి-ధారవాడ, మైసూరు నగరాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సీమెన్స్‌ సంస్థ సూత్రప్రాయంగా అంగీకరించిందని వాణిజ్యపరిశ్రమలశాఖ అదనపు కార్యదర్శి డాక్టర్‌ ఈవీ రమణారెడ్డి వెల్లడించారు. సాయం త్రం తర్వాత కూడా ముఖ్యమంత్రి సమావేశాలు కొనసాగాయి. నెస్లె సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షురాలు మగ్ది బతాటోతో సీఎం చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ పరిశ్రమలశాఖ మంత్రి మురుగేశ్‌ నిరాణి కూడా ఉన్నారు. తదుపరి డస్సాల్ట్‌ సిస్టమ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షుడు ఫ్లారెన్స్‌ వర్జిలెన్‌తో కూడా సీఎం సమావేశమయ్యారు. విద్యుత్‌రంగంలో ఆధునికత సాంకేతికతను సమకూర్చడం ద్వారా స్మార్ట్‌సిటీ పథకాలకు తుదిమెరుగులు దిద్దేందుకు సంబంధించి సంస్థ ఆసక్తి కనబరిచిందని, ఈ దిశలో మరిన్ని చర్చలు జరుగుతాయని సీఎం తెలిపారు. నెస్లె సంస్థ నంజనగూడులో ఇన్‌స్టంట్‌ కాఫీ ఫ్యాక్టరీని ఆధునికీకరించేందుకు అంగీకరించిందని సీఎం పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-24T18:02:52+05:30 IST