CM Bommai: సంగొళ్లిరాయణ్ణ పేరిట సైనిక్ స్కూల్
ABN , First Publish Date - 2022-08-16T18:31:46+05:30 IST
విప్లవవీరుడు సంగొళ్ళిరాయణ్ణ పేరిట వచ్చే సెప్టెంబరులో సైనిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్య మంత్రి బసవరాజ్ బొమ్మై(Chief

బెంగళూరు, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): విప్లవవీరుడు సంగొళ్ళిరాయణ్ణ పేరిట వచ్చే సెప్టెంబరులో సైనిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్య మంత్రి బసవరాజ్ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) ప్రకటించారు. బెంగళూరు మెజస్టిక్‌లో సంగొళ్ళి రాయణ్ణ 225వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సీఎం ప్రసంగిస్తూ విప్లవవీరుడు సంగొళ్ళిరాయణ్ణ పోరాట పటిమ సదా స్ఫూర్తినిస్తున్నాయన్నారు. ప్రతిపాదిత సైనిక పాఠశాలలో మౌలిక సదుపాయాలు, ఫర్నీచర్ కోసం రూ.50కోట్లను కేటాయించబోతున్నామన్నారు. సంగొళ్ళిరాయణ్ణ(Sangollirayana) ట్రస్టు ఆధ్వర్యంలోనే ఈ పాఠశాల నిర్వహణ ఉంటుందన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న వీర యోధులను మనం సదా స్మరించుకుంటూ ఉండాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. కన్నడ భాషా సంస్కృతుల కోసం పోరాడి అమరులైన నేతల సంస్మరణార్థం బెంగళూరులో ఓ ప్రత్యేక స్మారకాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ఉందని సీఎం తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహానేతల స్మార కాలను దశలవారీగా ఏర్పాటు చేస్తామన్నారు. కనకదాసు జన్మించిన బాడ ప్రాంతంలో రూ.25కోట్లతో ఒక ప్రత్యేక మ్యూజియంను నిర్మించామని గుర్తు చేశారు. ఆంగ్లేయుల పాలనపై వీరోచిత పోరాటం చేసిన రాయణ్ణ వారికి సింహస్వప్నంగా మారార న్నారు. ఢిల్లీలో సంగొళ్ళిరాయణ్ణ విగ్రహం ఏర్పాటుకు కేంద్ర ప్రభు త్వానికి లేఖ రాస్తామన్నారు. కిత్తూరు రాణి చెన్నమ్మ కూడా ఇదే కోవలోకి వస్తారన్నారు. భారత్ వరల్డ్ సూపర్ పవర్‌గా మారే రోజు మరెంతో దూరం లేదన్నారు. కార్య క్రమంలో మాజీ మంత్రి హెచ్ఎం రేవణ్ణ, మాజీ ఎమ్మెల్యే వాటాళ్ నాగరాజ్, మాజీ మేయర్ రామచంద్రప్ప(Ramachandrappa) ఇతర అధికారులు తది తరులు పాల్గొన్నారు.