Chief Minister: సీఎంతో ఆర్‌ఎస్ఎస్ నేత రహస్య చర్చలు

ABN , First Publish Date - 2022-12-10T12:46:54+05:30 IST

గుజరాత్‌ ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి మార్పులైనా జరుగవచ్చునని పార్టీలో చర్చకు తెరలేస్తుండగా సీఎం బసవరాజ్‌ బొ

Chief Minister: సీఎంతో ఆర్‌ఎస్ఎస్ నేత రహస్య చర్చలు

బెంగళూరు, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి) : గుజరాత్‌ ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి మార్పులైనా జరుగవచ్చునని పార్టీలో చర్చకు తెరలేస్తుండగా సీఎం బసవరాజ్‌ బొమ్మై(CM Basavaraj Bommai)తో ఆర్‌ఎస్ఎస్ ముఖ్యనేత ముకుంద్‌ భేటీ కావడం మరింత కుతూహలంగా మారింది. శుక్రవారం ఆర్‌టీనగర్‌లోని సీఎం నివాసానికి వచ్చిన ముకుంద్‌సుమారు అరగంటకు పైగా ప్రస్తుత రాజకీయాపై చర్చించారు. ఇదే సమయానికే మంత్రులు సోమణ్ణ, శివరామహెబ్బారతో పాటు పలువురు ఎమ్మెల్యేలు రావడం ప్రత్యేకతను సంతరించుకుంది. పార్టీ ప్రగతి, జనసంకల్పయాత్ర, మంత్రుల కార్యవైఖరితో పాటు కీలక అంశాలపై చర్చలు జరిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీకి చెందిన ఢిల్లీ నేతల సూచనల మేరకే ముకుంద్‌ ముఖ్యమంత్రిని కలిసినట్లు సమాచారం. ప్రభుత్వం, పార్టీకి సంబంధించిన అంశాలపై తరచూ సలహాలు, మార్గదర్శకాలను ఆర్‌ఎస్ఎస్ నేతలు ఇస్తుంటారు. అటువంటి ప్రక్రియలో భాగమే ఇద్దరి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమాలు ఇంటింటా ప్రచారం చేసేందుకు కొన్ని విధానాలు పాటించాలని సూచించినట్లు తెలిసింది. గుజరాత్‌ ఫార్ములా అమలు చేయాలని రాష్ట్రంలోని కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాల్లో అమలు చేసేలా సూచించినట్లు సమాచారం.

Updated Date - 2022-12-10T12:46:56+05:30 IST