Chief Minister: పథకాలపై ప్రచారం చేయండి

ABN , First Publish Date - 2022-12-01T08:45:49+05:30 IST

డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పిగొట్టాలని, ఆ మేరకు డీఎంకే కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి తమ ప్రభుత్వం

Chief Minister: పథకాలపై ప్రచారం చేయండి

- డీఎంకే కార్యకర్తలకు సీఎం పిలుపు

ప్యారీస్‌, నవంబరు 30: డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పిగొట్టాలని, ఆ మేరకు డీఎంకే కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన బుధవారం డీఎంకే కార్యకర్తలకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలు తమకందించిన పెద్ద బాధ్యతను మోస్తూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర హక్కులను కాపాడడంతో పాటు నిర్విరామంగా ప్రజలకు సేవలందిస్తున్నామన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పార్టీ కార్యకర్తలంతా డీఎంకే(DMK) ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. వీలైతే ప్రజలను కలుసుకుని వారికి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అవసరమైన నిధులను కేటాయిస్తూ, ప్రతి జిల్లాల్లోనూ కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు తాము చేపడుతున్న చర్యలను వివరించాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై బురద చల్లాలని కుట్ర పన్నాయని, వాస్తవాలను దాచిపెట్టి అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. దీనిని సవాల్‌ తీసుకుని తిప్పికొట్టేలా ప్రచారం చేయాలన్నారు. పార్టీలో పలు విభాగాల నేతలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, కౌన్సిలర్లుగా వ్యవహరిస్తున్నారని గుర్తు చేస్తూ.. కార్యకర్తలు పార్టీకి అండగా వుంటే వారినీ ఆయా పదవులు వరిస్తాయని సీఎం సూచించారు. ఇదిలా వుండగా భారత మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ బుధవారం సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. 1983వ సంవత్సరంలో భారత క్రికెట్‌ జట్టు ప్రపంచ కప్పు సాధించిన సందర్భంగా వచ్చిన జ్ఞాపికలను సీఎంకు చూపించారు.

Updated Date - 2022-12-01T08:45:52+05:30 IST