Chief Minister: విమానాశ్రయంలోనూ సీఎం జనతాదర్శన్
ABN , First Publish Date - 2022-12-15T11:58:38+05:30 IST
ధార్వాడ జిల్లా హుబ్బళ్లి తాలూకాలోని బైరి దేవరకొప్పలో బుధవారం నమ్మ క్లినిక్ పథకాన్ని ప్రారంభించేందుకు వచ్చిన
బెంగళూరు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ధార్వాడ జిల్లా హుబ్బళ్లి తాలూకాలోని బైరి దేవరకొప్పలో బుధవారం నమ్మ క్లినిక్ పథకాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) ఏకంగా ఎయిర్‌పోర్టులోనే జనతాదర్శన్ కార్యక్రమం నిర్వహించారు. ఎయిర్‌పోర్టు అవతల వినతి పత్రాలతో కనిపించిన ప్రజలను చూడగానే సీఎం కొద్దిసేపు అక్కడే ఉండిపోయారు. వరుసగా ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తూ వారి సమస్యలను ఆలకించారు. సీఎం బొమ్మై ఇటీవల క్రమం తప్పకుండా బెంగళూరు ఆర్టీ నగర్‌లోని తన నివాసంలో జనతాదర్శన్ నిర్వహిస్తున్నారు. ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా ప్రజల సమస్యలను ప్రత్యేకంగా ఆలకించి వినతి ప్రతాలను స్వీరించేందుకు కొంత సమయం కేటాయిస్తున్నారు. తాజాగా ఆయన ఎయిర్‌పోర్టులోనూ ఇదే సంప్రదాయాన్ని కొనసాగించారు.