Chidambaram ఆలయం వద్ద రెండంచెల భద్రత

ABN , First Publish Date - 2022-06-24T15:00:03+05:30 IST

చిదంబరం నటరాజస్వామివారి ఆలయం వద్ద గురువారం పోలీసులు రెండంచెల భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఆ ఆలయాన్ని దీక్షితార్లు సక్రమంగా

Chidambaram ఆలయం వద్ద రెండంచెల భద్రత

చెన్నై, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): చిదంబరం నటరాజస్వామివారి ఆలయం వద్ద గురువారం పోలీసులు రెండంచెల భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఆ ఆలయాన్ని దీక్షితార్లు సక్రమంగా నిర్వహించడం లేదని, భక్తుల నుంచి అధికంగా రుసుములు వసూలు చేయడంతోపాటు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపణలు రావడంతో దేవాదాయ శాఖ విచారణ జరుపుతోంది. ఆలయ నిర్వహణపై భక్తులు, స్థానికుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. అదే సమయంలో ఆ ఆలయంలో గతంలా కనకసభపై నిలిచి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు అనుమతించాలని దేవాదాయ శాఖ ఆదేశించింది. తాజగా కనకసభపై నిలిచి భక్తులు తిరువాచగం, దేవారం కీర్తనలను ఆలాపించేందుకు అనుమతించాలని మరో ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు సక్రమంగా అమలయ్యేందుకు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు, దీక్షితార్ల ఆగడాలను నిరోధించేందుకుగాను పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. 

Updated Date - 2022-06-24T15:00:03+05:30 IST