Chennai: టాస్మాక్ దీపావళి టార్గెట్ రూ.600 కోట్లు
ABN , First Publish Date - 2022-10-17T16:50:32+05:30 IST
దీపావళి సందర్భంగా రూ.600 కోట్ల మద్యం విక్రయాల లక్ష్యంగా టాస్మాక్ సంస్థ నిర్ణయించింది. గత ఏడాది దీపావళి
చెన్నై/పెరంబూర్: దీపావళి సందర్భంగా రూ.600 కోట్ల మద్యం విక్రయాల లక్ష్యంగా టాస్మాక్ సంస్థ నిర్ణయించింది. గత ఏడాది దీపావళి సందర్భంగా నవంబరు 3,4 తేదీల్లో రూ.431.03 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది దీపావళి పండుగ ముందు 22వ తేది రూ.200 కోట్లు, 23న రూ.200 కోట్లు, దీపావళి పండుగ రోజైన 24న రూ.200 కోట్లు మద్యం విక్రయాలు జరిగే అవకాశముందని టాస్మాక్ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం టాస్మాక్ మద్యం దుకాణాల్లో 10 రోజులకు సరిపడా మద్యం రకాలు సిద్ధంగా ఉంచారు.