నగరంలో మరో మూడు బయోగ్యాస్ కేంద్రాలు
ABN , First Publish Date - 2022-09-10T15:54:53+05:30 IST
చెన్నై కార్పొరేషన్ పరిధిలో మరో మూడు ప్రాంతాల్లో బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్లు కమిషనర్ గగన్దీప్సింగ్ బేదీ(Gagandeep Singh
ఐసీఎఫ్(చెన్నై), సెప్టెంబరు 9: చెన్నై కార్పొరేషన్ పరిధిలో మరో మూడు ప్రాంతాల్లో బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్లు కమిషనర్ గగన్దీప్సింగ్ బేదీ(Gagandeep Singh Bedi) తెలిపారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో అన్నానగర్ మండలం చెట్పెట్లోని బయోగ్యాస్ కేంద్రంలో తడి చెత్త నుంచి ఇంధనం తయారుచేస్తున్నారు. ఇదే విధంగా కొడుంగైయూర్, మాధవరం ప్రాంతాల్లో బయోగ్యాస్(Biogas) కేంద్రాలు ఏర్పాటవుతుండగా, అదనంగా మూడు ప్రాంతాల్లో వీటిని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.