రసాయనాలు కలిపిన పచ్చ బఠానీల స్వాధీనం

ABN , First Publish Date - 2022-02-01T16:15:27+05:30 IST

కోయంబేడు మార్కెట్లో రసాయనపు రంగులు కలిపిన కాయగూరలను కార్పొరే షన్‌ ఆహార భద్రతా విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మార్కెట్లోని పలు దుకాణాల్లో పచ్చబఠానీలు, క్యారెట్లు, బీన్స్‌ రంగులు కలిపి

రసాయనాలు కలిపిన పచ్చ బఠానీల స్వాధీనం

చెన్నై: కోయంబేడు మార్కెట్లో రసాయనపు రంగులు కలిపిన కాయగూరలను కార్పొరే షన్‌ ఆహార భద్రతా విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మార్కెట్లోని పలు దుకాణాల్లో పచ్చబఠానీలు, క్యారెట్లు, బీన్స్‌ రంగులు కలిపి అమ్ముతున్నారని ఫిర్యాదులు రావటంతో అధికారులు సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఆ సందర్భంగా రసాయనపు రంగులు కలిపిన 400 కేజీల పచ్చ బఠానీలను, బీన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని విక్రయిస్తున్న వారికి నోటీసులు జారీ చేశారు.

Updated Date - 2022-02-01T16:15:27+05:30 IST