గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన చన్నీ

ABN , First Publish Date - 2022-03-11T20:29:57+05:30 IST

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూడటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ..

గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన చన్నీ

న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూడటంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ తన రాజీనామాను గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌కు శుక్రవారంనాడు సమర్పించారు. ఈ విషయాన్ని చన్నీ తెలియజేస్తూ,  కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకూ క్యాబినెట్ కొనసాగించాలని గవర్నర్ కోరినట్టు చెప్పారు. ప్రజా తీర్పును తాను గౌరవిస్తున్నట్టు చన్నీ తెలిపారు. 117 స్థానాలున్న అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్లు గెలుచుకుని భారీ విజయాన్ని నమోదు చేసుకోగా, కాంగ్రెస్ 18 సీట్లు మాత్రమే దక్కించుకుంది. 'ఆప్' ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ శుక్రవారంనాడు ఢిల్లీలోని కేజ్రీవాల్‌ను కలిసి తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని ఆహ్వానిస్తారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ స్వస్థలమైన ఖాత్కర్ కళన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగనుంది.

Updated Date - 2022-03-11T20:29:57+05:30 IST