సరళ వాస్తు (Saral Vastu) నిపుణుడు Chandrashekhar Guruji దారుణహత్య

ABN , First Publish Date - 2022-07-05T22:15:15+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ హోటల్‌లో ప్రముఖ వాస్తు నిపుణుడు చంద్రశేఖర్ గురూజీ మంగళవారంనాడు దారుణ...

సరళ వాస్తు (Saral Vastu) నిపుణుడు Chandrashekhar Guruji దారుణహత్య

హుబ్లి: ప్రముఖ వాస్తు (Saral Vastu) నిపుణుడు చంద్రశేఖర్ గురూజీ (Chandrashekhar Guruji) మంగళవారంనాడిక్కడ ఒక హోటల్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. హోటల్ రెసెప్షనిస్ట్ ఏరియాలో ఇద్దరు వ్యక్తులు ఆయనను పలుమార్లు పొడిచి చంపినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయిందని పోలీసులు తెలిపారు. హంతకుల కోసం గాలిస్తున్నారు. కాగా, హత్యాసమాచారం తెలిసిన వెంటనే హుబ్లి పోలీస్ కమిషనర్ లబ్దు రామ్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.


బాగల్‌కోట్‌కు చెందిన గురూజీ కాంట్రాక్టర్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత కుంటుబ సభ్యులతో ముంబైలో స్థిరపడినట్టు కుటుంబ వర్గాలు తెలిపాయి. అనంతరం సరళ వాస్తు చెబుతూ మంచిపేరు తెచ్చుకున్నారు. మూడు రోజుల క్రితం ఆయన కుటుంబంలోని ఓ పిల్లవాడు మృతి చెందాడు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హుబ్లి వచ్చారు.

Read more