పళ్లిపట్టులో Chandrababu Roadshow

ABN , First Publish Date - 2022-07-10T15:49:40+05:30 IST

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లోని వైయస్సార్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ప్రచార పర్యటనలో

పళ్లిపట్టులో Chandrababu Roadshow

- చెన్నై టీడీపీ నేతల సందడి 

- గజమాలతో సత్కారం


చెన్నై, జూలై 9 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లోని వైయస్సార్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ప్రచార పర్యటనలో భాగంగా పళ్ళిపట్టు చేరుకున్న సందర్భంగా చెన్నైకి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. నగరిలో రోడ్‌షో ముగించుకుని కార్వేటినగరానికి వెళుతున్న చంద్రబాబుకు తమిళనాడులోని పళ్ళిపట్టు వద్ద చెన్నై టీడీపీ నేతలు కలుసుకుని ఆయనను గజమాలతో సత్కరించారు. సుమారు రెండువేలమంది కార్యకర్తలు ‘జైచంద్రబాబు’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. చెన్నై టీడీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌, రాజేష్‌, హోమణ్‌, సానకుప్పం మాజీ కౌన్సిలర్‌ రాజేంద్రనాయుడు, చలపతి, తులసి. సానకుప్పం, పళ్ళిపట్టు చుట్టుపక్కలి గ్రామ ప్రజలు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు.

Updated Date - 2022-07-10T15:49:40+05:30 IST