త్వరలో రాష్ట్రానికి కేంద్ర బృందాలు : సంజయ్‌

ABN , First Publish Date - 2022-07-20T08:07:01+05:30 IST

తెలంగాణలో వరదల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి తణక్షమే ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను పంపించాలని సంబంధిత అధికారులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఆదేశించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెల్లడించారు.

త్వరలో రాష్ట్రానికి కేంద్ర బృందాలు : సంజయ్‌

న్యూఢిల్లీ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వరదల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి తణక్షమే ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను పంపించాలని సంబంధిత అధికారులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఆదేశించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌తో కలిసి బండి సంజయ్‌ కేంద్ర మంత్రిని కలిశారు. వరదల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, జరిగిన నష్టాన్ని అమిత్‌ షాకు వివరించామని, దాంతో ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను పంపించాలని అధికారులను ఆదేశించారని సంజయ్‌ నేడొక ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలో ఉన్నత స్థాయి బృందాలు రాష్ట్రంలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక అందజేస్తాయని పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-20T08:07:01+05:30 IST