ద్విచక్ర వాహనాలపై పిల్లలకూ హెల్మెట్ తప్పనిసరి

ABN , First Publish Date - 2022-02-16T20:52:38+05:30 IST

ఇండియాలో ఇక నుంచి ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే పిల్లలు కూడా హెల్మెట్లు..

ద్విచక్ర వాహనాలపై పిల్లలకూ హెల్మెట్ తప్పనిసరి

న్యూఢిల్లీ: ఇండియాలో ఇక నుంచి ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే పిల్లలు కూడా హెల్మెట్లు ధరించాల్సిందే. వారికి కూడా హెల్మ్‌ట్లను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పిల్లల సైజుకు తగ్గట్టుగా హెల్మెట్లు తయారు చేయాలని హెల్మెట్ తయారీదారులను కేంద్రం ఆదేశించింది. పిల్లల భద్రత దృష్ట్యా హెల్మెట్లు ధరించడం తప్పనిసరి చేసినట్టు కేంద్రం చెబుతోంది. ఈ కొత్త నిబంధనను అతిక్రమించినట్టే రూ.1,000 జరిమానా విధించడంతో పాటు డ్రైవర్ లైసెన్స్‌ను 3 నెలల పాటు సస్పెండ్ చేస్తారు.


సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్-1989కి సవరణ ద్వారా ఈ కొత్త రూల్‌ను కేంద్రం తీసుకువచ్చింది. నాలుగేళ్ల పిల్లల వరకూ ఈ నిబంధనను వర్తిస్తుంది. పిల్లల్ని తీసుకువెళ్లే ద్విచక్ర వాహనాల వేగం గంటకు 40 కిలోమీటర్లు కంటే ఎక్కువ ఉండకూడదు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే పిల్లల భద్రత, హెల్మెట్ ధారణకు సంబంధించి ప్రజాభిప్రాయం కోరుతూ కేంద్ర 2021 అక్టోబర్‌లో ఒక డ్రాప్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

Read more