సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి

ABN , First Publish Date - 2022-02-10T01:16:36+05:30 IST

పరీక్షలను ఆఫ్‌లైన్ మోడ్‌లోనే నిర్వహించాలని సెంట్రల్

సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి

న్యూఢిల్లీ : పరీక్షలను ఆఫ్‌లైన్ మోడ్‌లోనే నిర్వహించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయించింది. 10, 12 తరగతుల సెకండ్ టెర్మ్ బోర్డు పరీక్షలను ఏప్రిల్ 26 నుంచి నిర్వహించనున్నట్లు బుధవారం ప్రకటించింది. త్వరలోనే పరీక్షల తేదీలను వెల్లడించనున్నట్లు తెలిపింది. 


సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యమ్ భరద్వాజ్ మాట్లాడుతూ, ఏప్రిల్ 26 నుంచి 10, 12 తరగతుల సెకండ్ టెర్మ్ బోర్డు పరీక్షలను నిర్వహించాలని సీబీఎస్ఈ బోర్డు నిర్ణయించిందన్నారు. సంబంధిత వర్గాలతో చర్చించడంతోపాటు కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ పరీక్షలను ఆఫ్‌లైన్ మోడ్‌లో మాత్రమే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. థియరీ పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభమవుతాయని, పరీక్షల తేదీలను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. 


Read more