ఫిబ్రవరి 15 నుంచి సీబీఎస్ఈ పరీక్ష లు

ABN , First Publish Date - 2022-12-30T00:56:24+05:30 IST

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌

ఫిబ్రవరి 15 నుంచి సీబీఎస్ఈ పరీక్ష లు

10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్‌ విడుదల

న్యూఢిల్లీ, డిసెంబరు 29: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎ్‌సఈ) 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఫిబ్రవరి 15 నుంచి ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21 వరకు 10వ తరగతి పరీక్షలు, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 5 వరకు 12వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ప్రతి పరీక్ష ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుంది. అలానే జనవరి 2 నుంచి ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు.

Updated Date - 2022-12-30T00:59:17+05:30 IST

Read more