కండోమ్‌లూ అడుగుతారేమో?

ABN , First Publish Date - 2022-09-29T09:08:18+05:30 IST

మీ కోరికలకు హద్దే ఉండదు. ప్రభుత్వం ఇస్తే ఉచిత జీన్‌ ఫ్యాంట్లు, అందమైన షూలు కూడా కావాలంటారు.

కండోమ్‌లూ అడుగుతారేమో?

బిహార్‌లో ఐఏఎస్‌ అధికారిణి అనుచిత వ్యాఖ్యలు

పట్నా, సెప్టెంబరు 28: ‘‘మీ కోరికలకు హద్దే ఉండదు. ప్రభుత్వం ఇస్తే ఉచిత జీన్‌ ఫ్యాంట్లు, అందమైన షూలు కూడా కావాలంటారు. భవిష్యత్‌లో కుటుంబ నియంత్రణ కోసం కండోమ్‌లు కూడా అడుగుతారేమో’’ ఇవి బిహార్‌లో ఓ ఐఏఎస్‌ అధికారిణి వ్యాఖ్యలు. రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ కూడా అయిన ఆమె, శానిటరీ ప్యాడ్స్‌ ఉచితంగా పంపిణీ చేయాలని అడిగిన విద్యార్థినులపై విరుచుకుపడ్డారు. ఐఏఎస్‌ అధికారిణి హర్‌జోత్‌ కౌర్‌ బమ్రా, కొంతమంది విద్యార్థినులకు మధ్య జరిగిన ఈ సంభాషణల వీడియో వైరల్‌ అవుతోంది. ప్రభుత్వం ఎన్నో ఉచిత పథకాలను అమలు చేస్తోంది. 20 - 30 రూపాయలు ఉండే శానిటరీ ప్యాడ్స్‌ ఉచితంగా ఇస్తే బాగుంటుంది అని విద్యార్థినులు అడిగారు. దీనికి ఐఏఎస్‌ అధికారి హర్‌జీత్‌ కౌర్‌ పైవిధంగా సమాధానం ఇవ్వడంతో వారు షాక్‌ తిన్నారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తారు? ప్యాడ్స్‌ అడిగితే తప్పేమిటని విద్యార్థినులు ప్రశ్నించగా, పాకిస్థాన్‌లా మీరు ఓట్లు వేయకండి అంటూ ఆమె అనడం వివాదాస్పదమైంది.

Read more