cable bridge collapse: ఆ అల్లరిమూక వల్లే గుజరాత్‌లో కేబుల్ బ్రిడ్జ్ కూలిందా?

ABN , First Publish Date - 2022-10-30T22:03:19+05:30 IST

మోర్బి: గుజరాత్‌ మోర్బి జిల్లా మచ్చూ (Machchhu) నదిపై కేబుల్ బ్రిడ్జ్ (Cable bridge) కుప్పకూలడానికి అల్లరిమూక చేష్టలే కారణమా?

cable bridge collapse: ఆ అల్లరిమూక వల్లే గుజరాత్‌లో కేబుల్ బ్రిడ్జ్ కూలిందా?
cable bridge collapse

మోర్బి: గుజరాత్‌ మోర్బి జిల్లా మచ్చూ (Machchhu) నదిపై కేబుల్ బ్రిడ్జ్ (Cable bridge) కుప్పకూలడానికి అల్లరిమూక చేష్టలే కారణమా? కూలడానికి ముందు వంతెనపై ఉన్నవారిలో కొందరు విపరీతంగా ప్రవర్తించారు. వంతెనను విపరీతంగా ఊపడంతో పాటు ఎగిరెగిరి దూకారు. కేబుళ్లను కాళ్లతో తన్నారు. కేబుల్ బ్రిడ్జ్‌కు దూరంగా ఉన్నవారు చిత్రీకరించిన దృశ్యాల్లో ఇది రికార్డైంది. కొందరు ఆకతాయిల ప్రవర్తనపై ఆందోళన వ్యక్తమౌతోంది. అల్లరిమూకల చేష్టలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై జాతీయ మీడియా సంస్థలు పెద్ద ఎత్తున కథనాలు ప్రసారం చేస్తున్నాయి. అల్లరిమూకల నిర్వాకంపై పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది.

కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో నిమిష నిమిషానికి మరణాల సంఖ్య పెరుగుతునే ఉంది. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై 500 మందికిపైగా సందర్శకులున్నారు. వీరంతా నదిలో పడిపోయారు. ఇప్పటివరకూ కేవలం 70 మందినే కాపాడగలిగారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చర్యలు చేపట్టాయి. వందేళ్ల క్రితం నాటి ఈ బ్రిడ్జికి ఇటీవలే మరమ్మతులు చేశారు. 5 రోజుల క్రితమే దీన్ని పున:ప్రారంభించారు. ఆదివారం కూడా కావడంతో సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. సహాయక చర్యల్లో గుజరాత్ ప్రభుత్వానికి అన్నివిధాలా సాయమందిస్తామని తెలిపారు.

Updated Date - 2022-10-30T22:07:09+05:30 IST