హైదరాబాద్, బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు!
ABN , First Publish Date - 2022-01-04T06:40:01+05:30 IST
అన్నీ అనుకున్నట్టు జరిగితే హైదరాబాద్, బెంగళూరు మధ్య
- కొత్త రూట్లపై రైల్వే శాఖ ప్రతిపాదన
- నాలుగు కొత్త రూట్లపై రైల్వే శాఖ ప్రతిపాదన
- న్యూఢిల్లీ, జనవరి 03: అన్నీ అనుకున్నట్టు జరిగితే హైదరాబాద్, బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు పరుగుపెట్టనుంది. ఇదే జరిగితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా హైస్పీడ్ రైళ్లు దూసుకెళ్తాయి. నేషనల్ రైల్ ప్లాన్ కింద రైల్వేశాఖ ఇప్పటికే 8 హైస్పీడ్ కారిడార్ల అభివృద్ధికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ముంబై-హైదరాబాద్‌ను కలుపుతూ 711 కిలోమీటర్ల మేర ఓ కారిడార్ కూడా ఇందులో ఉంది.
- ఈ ప్రాజక్ట్‌కు సంబంధించిన సర్వే కూడా జరుగుతోంది. ఈ 8 కారిడార్లకు అదనంగా మరో 4రూట్లను హైస్పీడ్ కారిడార్లుగా మార్చాలని రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్-బెంగళూరు(618 కిలోమీటర్లు)తోపాటు నాగపూర్-వారాణసీ(855 కిమి), పట్నా-గువాహటి(850 కిమీ), అమృత్‌సర్-పఠాన్‌కోట్-జమ్ము(190 కిమీ) కొత్త జాబితాలో ఉన్నాయి. వీటి నిర్మాణానికి ఈ ఏడాదిలోనే ఆమోదముద్ర పడే అవకాశం ఉందని రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి.