బడ్జెట్‌పై సీఎం తుది మెరుగులు
ABN , First Publish Date - 2022-02-27T18:15:47+05:30 IST
రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గడువు సమీపిస్తున్న తరుణంలో తుదిమెరుగులు దిద్దేందుకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సిద్ధమయ్యారు. శనివారం చిన్నతరహా పరిశ్రమల సమాఖ్య (కాసియా) ప్రతినిధులతో ప్రత్యేక

బెంగళూరు: రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గడువు సమీపిస్తున్న తరుణంలో తుదిమెరుగులు దిద్దేందుకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సిద్ధమయ్యారు. శనివారం చిన్నతరహా పరిశ్రమల సమాఖ్య (కాసియా) ప్రతినిధులతో ప్రత్యేక సమావేశమయ్యారు. బడ్జెట్లో ఎంఎస్ఎంఈ, స్టార్ట్‌పలకు 4 శాతం వడ్డీతో రుణాలు ఇవ్వాలని, తద్వారా పరిశ్రమల ప్రగతికి ప్రయోజనకరమని వివరించారు. పలుశాఖల అధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మరో మూడు రోజులు మాత్రమే బడ్జెట్ సమావే శాలకు గడువు ఉండడంతో సీఎం ఉదయం నుంచి సాయంత్రందాకా బిజీగా గడిపారు.