Bangladesh సరిహద్దుల్లో వరదలో కొట్టుకుపోయిన బీఎస్ఎఫ్ జవాన్
ABN , First Publish Date - 2022-07-16T17:22:48+05:30 IST
బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో భారీవర్షాల కారణంగా వెల్లువెత్తిన వరదనీటిలో పహరా కాస్తున్న సరిహద్దు భద్రతా దళం (BSF) జవాన్ కొట్టుకుపోయారు....

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో భారీవర్షాల కారణంగా వెల్లువెత్తిన వరదనీటిలో పహరా కాస్తున్న సరిహద్దు భద్రతా దళం (BSF) జవాన్ కొట్టుకుపోయారు. నసీరుద్దీన్ అహ్మద్ అనే జవాన్‌ను ఇండో-బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ బోర్డర్‌కు సమీపంలోని ఇచ్చమతి నది వద్ద ఫ్లోటింగ్ బోర్డర్ అవుట్‌పోస్ట్ (బీఓపీ)లో నియమించారు.సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ నసీరుద్దీన్ అహ్మద్ ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయాడు. వరద నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో జవాన్ కొట్టుకుపోయాడు. తోటి జవాన్లు అతన్ని నది నీటిలో నుంచి బయటకు లాగేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. బీఎస్ఎఫ్ జవాన్లు నది నీటిలోకి దూకి అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. నసీరుద్దీన్ ను నీటిలో నుంచి బయటకు తీసి సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అతను మరణించినట్లు ప్రకటించారు.