అద్భుతం చేసిన బ్రెజిల్‌ వైద్యులు

ABN , First Publish Date - 2022-08-04T11:03:56+05:30 IST

బ్రెజిల్‌ వైద్యులు అద్భుతం చేశారు. నాలుగేళ్ల క్రితం పుట్టిన అవిభక్త కవలలను విజయవంతంగా వేరు చేశారు.

అద్భుతం చేసిన బ్రెజిల్‌ వైద్యులు

27 గంటలు కష్టించి అవిభక్త కవలలకు ఆపరేషన్‌

బ్రెసిలియా, ఆగస్టు 3: బ్రెజిల్‌ వైద్యులు అద్భుతం చేశారు. నాలుగేళ్ల క్రితం పుట్టిన అవిభక్త కవలలను విజయవంతంగా వేరు చేశారు. దాదాపు 100 మంది వైద్యులు వర్చువల్‌ రియాలిటీ విధానంలో 27 గంటల పాటు కష్టించి 9 సర్జరీలతో ఇరువురి తలలను వేరు చేశారు. జూన్‌ 7-9 మధ్య జరిగిన ఈ ఆపరేషన్‌ వివరాలను వైద్యులు బుధవారం వెల్లడించారు. ఆర్థర్‌, బెర్నార్డో లిమా అనే ఆ ఇద్దరు మగ శిశువులు 2018లో కపాలం కలిసిపోయి అవిభక్తంగా జన్మించారు. రెండేళ్ల క్రితం వాళ్లను తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించగా.. లండన్‌కు చెందిన ఓ చారిటీ సంస్థ ఆపరేషన్‌ ఖర్చును భరించింది.

Updated Date - 2022-08-04T11:03:56+05:30 IST