Boy Fell Into a Borewell: బోరు బావిలో పడిన బాలుడు...రెస్క్యూ ఆపరేషన్ షురూ

ABN , First Publish Date - 2022-12-07T05:01:29+05:30 IST

ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన ఘటన ....

Boy Fell Into a Borewell: బోరు బావిలో పడిన బాలుడు...రెస్క్యూ ఆపరేషన్ షురూ
Boy Fell Into a Borewell

భోపాల్ (మధ్యప్రదేశ్): ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి వెలుగుచూసింది.(Boy Fell Into a Borewell) బేతుల్ జిల్లాలోని ఓ గ్రామంలో మంగళవారం రాత్రి ఆడుకుంటున్న ఓ బాలుడు బోరుబావిలో పడ్డాడు. ఈ దుర్ఘటన గురించి సమాచారం అందటంతో పోలీసులు, జిల్లా అధికారులు హుటాహుటిన బోరు బావి వద్దకు వచ్చి రెస్క్యూ ఆపరేషన్(Rescue Operation) ప్రారంభించారు.బాలుడి కదలికలను పర్యవేక్షించేందుకు బోర్‌వెల్‌లో కెమెరాను అమర్చామని తెలిపారు.బోర్‌వెల్,టన్నెల్‌లో ఆక్సిజన్ సరఫరా కోసం ఏర్పాట్లు చేశారు.జిల్లా కలెక్టర్‌తో పాటు ఎస్పీ సీమల ప్రసాద్, ఇతర అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.మధ్యప్రదేశ్( Madhya Pradesh) రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్(CM Shivraj Chouhan) పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

Updated Date - 2022-12-07T05:01:30+05:30 IST