విశ్వాస ఓటింగ్‌లో యూకే ప్రధాని Boris Johnson విజయం
ABN , First Publish Date - 2022-06-07T12:42:03+05:30 IST
యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)దేశ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ విశ్వాస ఓటింగ్‌లో విజయం సాధించారు...

లండన్: యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)దేశ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ విశ్వాస ఓటింగ్‌లో విజయం సాధించారు. దీంతో జాన్సన్ యూకే ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. పార్టీగేట్ కుంభకోణం తర్వాత కన్జర్వేటివ్ పార్టీలో పెద్ద తిరుగుబాటు జరిగింది. 2019వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో విజయాన్ని సాధించిన జాన్సన్ కొవిడ్-19 మహమ్మారి దృష్ట్యా బ్రిటన్ లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు అతను తన డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయంలో, నివాసంలో మద్యంతో కూడిన పార్టీలు నిర్వహించారు.దీంతో జాన్సన్‌కు విశ్వాస ఓటింగు పేరిట దెబ్బ తగిలింది. జాన్సన్ నాయకత్వానికి వ్యతిరేకంగా 41శాతం మంది చట్టసభ సభ్యులు ఓటు చేశారు.
211 మంది శాసనసభ్యుల్లో జాన్సన్‌కు అనుకూలంగా 148 మంది ఓటు వేశారు. బోరిస్ జాన్సన్ విశ్వాస ఓటింగ్‌లో గెలుపొందడం ద్వారా 12 నెలల పాటు ఉపశమనాన్ని పొందారు. ఆర్థిక మాంద్యం, ఇంధనం, ఆహార ధరలు పెరగడం, రాజధాని లండన్‌లో సమ్మె కారణంగా బ్రిటన్‌ను పరిపాలించే అధికారాన్ని జాన్సన్ కోల్పోయారని కొందరు కన్జర్వేటివ్ చట్టసభ సభ్యులు విమర్శించారు.