boat capsized tragedy: ఉత్తరప్రదేశ్‌లో పడవ మునక.. నలుగురి మృతి..
ABN , First Publish Date - 2022-08-11T23:33:02+05:30 IST
ఫతేపూర్: ఉత్తరప్రదేశ్ ఫతేపూర్‌లోని మర్కా గ్రామంలో పడవ యమునా నదిలో మునిగి ముగ్గురు చనిపోయారు. పలువురు గల్లంతయ్యారు.

ఫతేపూర్: ఉత్తరప్రదేశ్ ఫతేపూర్‌లోని మర్కా గ్రామంలో పడవ యమునా నదిలో మునిగి నలుగురు చనిపోయారు. పలువురు గల్లంతయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, చిన్నారి కూడా ఉన్నారు. సహాయక బృందాలు ఇప్పటి వరకూ 15 మందిని కాపాడగలిగాయి. ఫతేపూర్ నుంచి మర్కా గ్రామానికి వెళ్తుండగా పడవ నదిలో మునిగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణిస్తున్నారని తెలిసింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.