BKU నేత, Lakhimpur కేసులో సాక్షి దారుణ హత్య
ABN , First Publish Date - 2022-06-01T18:00:12+05:30 IST
లఖింపూర్ కేసు(Lakhimpur Case)లో ప్రత్యక్ష సాక్షి, భారతీయ కిసాన్ యూనియన్ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆయన మరణించారు. లఖింపూర్ జిల్లాలో మంగళవారం జరిగిందీ..

లఖ్నవూ: లఖింపూర్ కేసు(Lakhimpur Case)లో ప్రత్యక్ష సాక్షి, భారతీయ కిసాన్ యూనియన్ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆయన మరణించారు. లఖింపూర్ జిల్లాలో మంగళవారం జరిగిందీ దుర్ఘటన. బీకేయూ జిల్లా అధ్యక్షుడైన దిల్బాగ్ సింగ్ మంగళవారం రాత్రి అలిగంజ్-ముండా రోడ్డులో వెళ్తుండగా గోలా కొత్వాలి సమీపంలో ఆయన ఎస్యూవీ(SUV) కారును పంక్చర్ చేశారు. దీంతో ఆయన మధ్యలోనే ఆగాల్సి వచ్చింది. ఆ సమయంలోనే కాల్పులు జరపడంతో ఆయన మరణించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, గతేడాది అక్టోబర్ 3న కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రీ ప్రధాన నిందితుడిగా ఉన్న లఖింపూర్ ఖేరి దారుణంలో ప్రత్యక్ష సాక్షుల్లో బల్బీర్ సింగ్ ఒకరు.