వారణాసి సీటు కోల్పోయిన బీజేపీ, విజేతగా మాఫియా డాన్ భార్య

ABN , First Publish Date - 2022-04-12T19:47:32+05:30 IST

ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ (ఎమ్మెల్సీ) ఎన్నికల్లో బీజేపీ 36 సీట్లలో 33 సీట్లు గెలుచుకుని ..

వారణాసి సీటు కోల్పోయిన బీజేపీ, విజేతగా మాఫియా డాన్ భార్య

వారణాసి: ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ (ఎమ్మెల్సీ) ఎన్నికల్లో బీజేపీ 36 సీట్లలో 33 సీట్లు గెలుచుకుని విజయబావుటా ఎగురవేసింది. అయితే, ప్రధానమంత్రి పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసి ఎమ్మెల్సీ సీటును మాత్రం కోల్పోయింది. జైలులో ఉన్న మాఫియా డాన్ బ్రిజేష్ సింగ్ కుటుంబం మరోసారి తమ  ఏకఛత్రాధిపత్యాన్ని చాటుకుంది. బ్రిజేష్ సింగ్ భార్య అన్నపూర్ణ సింగ్ రెండోసారి కూడా వారణాసి సీటు నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైంది. ఆమెకు 4.234 ఓట్లు పోల్ కాగా, సమాజ్‌వాదీ పార్టీ నేత ఉమేష్ యాదవ్ 345 ఓట్లతో రెండో స్థానంలోనూ, బీజేపీ అభ్యర్థి సుదామా పటేల్ కేవలం 170 ఓట్లతో మూడో స్థానంలోనూ నిలిచారు. 1998 నుంచి బ్రిజేష్ కుటుంబం ఇక్కడ తమ పట్టు సాగిస్తూ వస్తోంది.

Updated Date - 2022-04-12T19:47:32+05:30 IST