Rathyatra: బీజేపీ ఆధ్వర్యంలో రథయాత్రలు

ABN , First Publish Date - 2022-07-23T18:35:28+05:30 IST

ఆజాది కా అమృత మహోత్సవాలను పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో ఆగస్టు 9 నుంచి 18 వరకు నాలు

Rathyatra: బీజేపీ ఆధ్వర్యంలో రథయాత్రలు

- ఆజాదీ కా అమృత మహోత్సవాల వేళ ప్రజల్లో జాగృతి

- రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌ 


బెంగళూరు, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఆజాది కా అమృత మహోత్సవాలను పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో ఆగస్టు 9 నుంచి 18 వరకు నాలుగు రెవెన్యూ డివిజన్లలోనూ రథయాత్రలను చేపట్టనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు(Bjp State President) నళిన్‌ కుమార్‌ కటీల్‌ ఈ మేరకు నగరంలో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రథయాత్ర(Rathyatra)ల ముగింపు కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ఆహ్వానించాలని నిర్ణయించామన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు కావస్తున్న శుభసందర్భంగా ప్రజల్లో జాగృతిని, దేశభక్తిని పెంపొందించేందుకే ఈ రథయాత్రలను తలపెట్టామని ఆయన పేర్కొన్నారు. పంద్రాగస్టు(August 15th) ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో కోటి  ఇళ్లపై జాతీయ పతాకం రెపరెపలాడేలా చూస్తామన్నారు. బీదర్‌(Beedar) జిల్లాలోని గుర్టా నుంచి బయల్దేరే రథానికి రాజావెంకటప్పనాయక అని పేరు పెట్టామన్నారు. ఈ రథం కల్యాణ కర్ణాటక(Kalyana Karnataka)లోని అన్ని ప్రముఖ పట్టణాల మీదుగా సాగుతుందన్నారు. ధార్వాడ జిల్లాలోని కిత్తూరు నుంచి బయల్దేరే రథానికి రాణి కిత్తూరుచెన్నమ్మ రథం అని నామకరణం చేశామన్నారు.  చిత్రదుర్గ(Chitradurga) నుంచి బయల్దేరే రథానికి ఒనకే ఓబవ్వ రథయాత్రగానూ, దక్షిణ కన్నడ నుంచి బయల్దేరే రథానికి రాణి అబ్బక్క రథం అని నామకరణం చేశామన్నారు. ఈ నాలుగు రథాలు తమ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని జిల్లాలు, ముఖ్యమైన నగరాలు పట్టణాల మీదుగా ప్రయాణించి బెంగళూరుకు చేరుకుంటాయన్నారు.

Updated Date - 2022-07-23T18:35:28+05:30 IST