ఇదేం చోద్యం.. బాలురకు శానిటరీ నాప్కిన్ల కొనుగోలుకు నిధుల మంజూరు...!

ABN , First Publish Date - 2022-01-23T22:25:36+05:30 IST

బీహార్‌లో ప్రభుత్వ నిధుల వినియోగంలో అవకతవకలు జరిగినట్టు తాజాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలికలకు ఉద్దేశించిన ‘పోషన్ పథకం’లో బాలురకు శానిటరీ నాప్కిన్లు, ఇతర దుస్తులు కొనుగోలు కోసం నిధులు మంజూరైన ఘటన సరన్ జిల్లాలోని హల్‌కోరీ షా స్కూల్లో వెలుగు చూసింది.

ఇదేం చోద్యం..  బాలురకు శానిటరీ నాప్కిన్ల కొనుగోలుకు నిధుల మంజూరు...!

పాట్నా: బీహార్‌లో ప్రభుత్వ నిధుల వినియోగంలో అవకతవకలు జరిగినట్టు తాజాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలికలకు ఉద్దేశించిన ‘పోషన్ పథకం’లో బాలురకు శానిటరీ నాప్కిన్లు, ఇతర దుస్తులు కొనుగోలు కోసం నిధులు మంజూరైన ఘటన సరన్ జిల్లాలోని హల్‌కోరీ షా స్కూల్లో వెలుగు చూసింది. ఆ స్కూల్‌లో కొత్తగా నియమితులైన హెడ్‌మాస్టర్ ఈ విషయాన్ని గుర్తించి జిల్లా మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. గత మూడేళ్ల రికార్డుల్లో ఇలాంటివి పలు గుర్తించానని ఆయన పేర్కొన్నారు. కాగా.. తనకు హెడ్‌మాస్టర్ నుంచి లేఖ అందిన విషయాన్ని శరన్ జిల్లా విద్యాశాఖాధికారి శనివారం ధృవీకరించారు. అంతేకాకుండా.. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపేందుకు ఇద్దరు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఆ కమిటీ వారంలోపు దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Read more