కాసేపట్లో సంచలన ప్రకటన చేస్తా: మాన్
ABN , First Publish Date - 2022-03-17T18:26:08+05:30 IST
చండీగఢ్: కాసేపట్లో సంచలన ప్రకటన చేస్తానని పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు.

చండీగఢ్: కాసేపట్లో సంచలన ప్రకటన చేస్తానని పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. పంజాబ్ ప్రజల హితం కోసం నేడు చారిత్రక నిర్ణయం తీసుకోబోతున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. పంజాబ్ చరిత్రలో ఇంతకుమునుపెవ్వరూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా ఆయన వెల్లడించారు. సీఎం చేయబోయే ప్రకటన కోసం అంతా ఎదురుచూస్తున్నారు.
పంజాబ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గానూ ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాలు గెలుచుకుంది. సీఎం చన్నీ, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, శిరోమణి అకాలీదళ్ అగ్రనేతలందరినీ ఆప్ అభ్యర్ధులు చిత్తుగా ఓడించారు.