Bhagavad Gita: బీజేపీకి ఓటేస్తే పాఠశాలల్లో భగవద్గీత బోధిస్తాం...సువేందు అధికారి హామీ
ABN , First Publish Date - 2022-08-09T13:34:52+05:30 IST
పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ ప్రముఖ నేత సువేందు అధికారి(Suvendu Adhikari) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు....

కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ ప్రముఖ నేత సువేందు అధికారి(Suvendu Adhikari) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు బీజేపీకి ఓటు వేస్తే(if BJP voted to power) పాఠశాలల్లో భగవద్గీతను(Bhagavad Gita) బోధించేలా సిలబస్లో చేర్పిస్తామని(BJP will include Bhagavad Gita in the school syllabus) సువేందు అధికారి ప్రకటించారు.ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న సువేందు అధికారి(Suvendu Adhikari, Leader of the Opposition in the West Bengal Legislative Assembly) ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘భగవద్గీత మత గ్రంథం కాదు...గుజరాత్(Gujarat) రాష్ట్రంలో భగవద్గీతను పాఠశాల సిలబస్ లో చేర్చారు, బెంగాల్ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో జాతీయవాద ప్రభుత్వం అధికారంలోకి వస్తే పాఠశాల పాఠ్యపుస్తకాల్లో భగవద్గీతను చేరుస్తాం’’ అని సువేందు అధికారి చెప్పారు. బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. సనాతన ధర్మ ప్రచారం కోసం గుజరాత్ ప్రభుత్వం 6 నుంచి 12వతరగతి పాఠ్యాంశాల్లో భగవద్గీతను ఇప్పటికే చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.