Bengaluru: పదేళ్లలో రెట్టింపు కానున్న బెంగళూరు జనాభా
ABN , First Publish Date - 2022-11-19T12:08:07+05:30 IST
రాజధాని బెంగళూరు(Bengaluru) జనసంఖ్య రానున్న పదేళ్లలో రెట్టింపు కా నుంది. ప్రస్తుతం 1.30 కోట్లుగా ఉన్న జనాభా దశాబ్దం కాలంలోనే ఏకంగా 2.5 కోట్ల
- మౌలిక సదుపాయాలు మాత్రం అంతంతే..
బెంగళూరు, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): రాజధాని బెంగళూరు(Bengaluru) జనసంఖ్య రానున్న పదేళ్లలో రెట్టింపు కా నుంది. ప్రస్తుతం 1.30 కోట్లుగా ఉన్న జనాభా దశాబ్దం కాలంలోనే ఏకంగా 2.5 కోట్లకు చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నామని బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) స్పెషల్ కమిషనర్ డాక్టర్ త్రిలోక్‌చంద్ర(Dr. Trilokchandra) తెలిపారు. బెంగళూరు టెక్‌సమ్మిట్‌లో సెమినార్‌లో పాల్గొన్న ఆయన దేశవిదేశాల నుంచి రకరకాల కారణాలతో ప్రజల వలస పెరుగుతోందన్నారు. ఇప్పటికే నగరం మినీ వరల్డ్ ను తలపిస్తోందన్నారు. పెరుగుతున్న నగర జనాభాకు ఆరోగ్య సదుపాయాలను అందించడమే పెనుసవాల్‌గా ఉందన్నారు. వాహనాల సంఖ్య పెరిగి కాలుష్యం కోరలు చాస్తోందని, వాతావరణ కాలుష్యమే కాకుండా నగరాన్ని పలు రకాల కాలుష్యాలు పట్టిపీడిస్తున్నాయన్నారు. వీటిని నియంత్రించేందుకు బీబీఎంపీ(BBMP) ఏటా వందల కోట్లు ఖర్చుచేస్తున్నా పూర్తిస్థాయిలో ఫలితాలు కనిపించడం లేదన్నారు. పర్యావరణ సంరక్షణ ప్రజలందరి కర్తవ్యంగా మారినప్పుడే సమస్య తీవ్రత కొంతమేరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగర మౌలిక సదుపాయాలు లేవన్న వాదనను ఆయన అంగీకరించారు. నగర అభివృద్ధికి దూరదృష్టితో కూడిన కార్యక్రమాల అవసరం ఎంతైనా ఉందన్నారు. వివిధ శాఖల మధ్య తగిన సమన్వయం లేకపోవ డం వల్లే మౌలిక సదుపాయల కల్పనలో భారీ జాప్యం కనిపిస్తోందని తెలిపారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను పెంచే అంశంపై ఇప్పటి నుంచే దృష్టి సారించడం చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. నగర జనాభా నానాటికి పెరుగుతున్నా మౌలిక సదుపాయాలు దిగదుడుపు గానే ఉన్నాయని ఈ సెమినార్‌లో పాల్గొన్న పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.