Break: బెంగళూరులో భిక్షాటనకు బ్రేక్‌

ABN , First Publish Date - 2022-09-17T17:29:58+05:30 IST

బెంగళూరు(Bangalore) వ్యాప్తంగా రానున్న రెండు మూడు నెలల్లో భిక్షాటనకు బ్రేక్‌ పెడతామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కోట

Break: బెంగళూరులో భిక్షాటనకు బ్రేక్‌

బెంగళూరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు(Bangalore) వ్యాప్తంగా రానున్న రెండు మూడు నెలల్లో భిక్షాటనకు బ్రేక్‌ పెడతామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కోట శ్రీనివాసపూజారి(Mantri Kota Srinivasapujari) తెలిపారు. పరిషత్‌లో శుక్రవారం ప్రశ్నోత్తరాల వేళ బీజేపీ సభ్యుడు ఆర్‌ దేవెగౌడ ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. బెంగళూరులో భిక్షాటన నియంత్రించాల్సిన అనివార్యం ఉందన్నారు. చిన్న పిల్లలకు మత్తు ఇచ్చి భిక్షాటన చేస్తున్నట్టు గతంలో కొన్ని కేసుల్లో బహిర్గతమయిందన్నారు. భిక్షాటన తర్వాత చిన్నారిని తల్లిదండ్రులకు వాపసు ఇస్తున్నారని, వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగిస్తామన్నారు. వృద్ధుల ద్వారా భిక్షాటన చేసేవారిని గుర్తిస్తామన్నారు. మంగళముఖిలు భిక్షాటన వేళ గొడవలు చోటు చేసుకున్నాయన్నారు. నియంత్రణకోసం డీసీపీ నేతృత్వంలో 8 టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశామన్నారు 18 ఏళ్లలోపు చిన్నారులను అరెస్టు చేసే అవకాశం లేనందున, న్యాయవ్యవహారాలశాఖ మంత్రితో చర్చించి వారిని రక్షించే ప్రక్రియ కొనసాగిస్తామన్నారు. కార్మికుల చిన్నారుల కోసం పైలట్‌ ప్రా జెక్ట్‌ కింద శిక్షణ ఇస్తామన్నారు. 

Read more