పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలి: ఆర్‌.కృష్ణయ్య

ABN , First Publish Date - 2022-12-30T01:56:37+05:30 IST

పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని, బీసీలకు చట్టసభలలో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని...

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలి: ఆర్‌.కృష్ణయ్య

న్యూఢిల్లీ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని, బీసీలకు చట్టసభలలో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. గురువారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన ధర్నాలో మాట్లాడుతూ బీసీ బిల్లు పెట్టే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. బీసీ వర్గానికి చెందిన నరేంద్రమోదీ ప్రధానిగా ఉన్న కాలంలోనే చట్టసభలలో రిజర్వేషన్లు పెట్టే అవకాశమున్నందున పార్టీలకు అతీతంగా బీసీలు ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2022-12-30T01:58:05+05:30 IST

Read more