Cheetah: బళ్లారి కొండపై మళ్లీ చిరుత ప్రత్యక్షం
ABN , First Publish Date - 2022-10-03T16:56:07+05:30 IST
రెండు నెలల క్రితం బళ్లారి కొండపై కలకలం రేపిన చిరుత మరోసారి ఆదివారం ప్రత్యక్షం అయింది. పారెస్టు రేంజర్ ఆఫీసర్ రాఘవేంద్ర వారి సిబ్బంది డ్రోన్

బళ్లారి(బెంగళూరు), అక్టోబరు 2: రెండు నెలల క్రితం బళ్లారి కొండపై కలకలం రేపిన చిరుత మరోసారి ఆదివారం ప్రత్యక్షం అయింది. పారెస్టు రేంజర్ ఆఫీసర్ రాఘవేంద్ర వారి సిబ్బంది డ్రోన్ కెమెరాలతో చిరుత పొటోలు తీశారు. ఈసందర్బంగా అధికారులు మాట్లాడుతూ కొండపై చిరుత సంచారంతో ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. పాలికె సభ్యురాలు శశికళా జగన్నాథ్(Shashikala Jagannath), అక్కడి నివాసులు విజయ్‌కుమార్, శ్రీప్రాణలింగప్ప వీరనగౌడ, శివకుమార్, రంగనాథ్ తదితరులు మాట్లాడుతూ నవరాత్రుల సందర్బంగా వేకువ జామున మహిళలు ఆలయాలకు వెళ్తుంటారని, అధికారులు చి రుతను బంధించి అడవికి తరలించాలని కోరారు.