‘గోద్రా’ ముద్దాయిల్లో ఒకరికి బెయిల్‌

ABN , First Publish Date - 2022-12-16T01:05:10+05:30 IST

గోద్రా రైలు దహనం కేసులోని ముద్దాయిల్లో ఒకరికి గురువారం సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ముద్దాయి ఫరూక్‌ 17 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించడంతో ఈ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు

‘గోద్రా’ ముద్దాయిల్లో ఒకరికి బెయిల్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 15: గోద్రా రైలు దహనం కేసులోని ముద్దాయిల్లో ఒకరికి గురువారం సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ముద్దాయి ఫరూక్‌ 17 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించడంతో ఈ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎ్‌స.నరసింహల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. గుజరాత్‌ ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ ముద్దాయి అమానుషనీయమైన నేరం చేశాడని, అందువల్ల బెయిల్‌ మంజూరు చేయకూడదని కోరారు. 2002లో సబర్మతి ఎక్స్‌ప్రె్‌సలోని ఎస్‌-6 బోగీలో మంటలు వ్యాపించినప్పుడు ప్రయాణికులు బయటకు రాకుండా రాళ్లు విసిరేలా ముద్దాయి ప్రోత్సహించాడని తెలిపారు. ఈ ప్రమాదంలో 59 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. అయితే 17 ఏళ్లపాటు జైలులో ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తగిన షరతులు విధిస్తూ బెయిల్‌ ఇవ్వాలని కింది కోర్టుకు సూచించింది.

Updated Date - 2022-12-16T01:05:11+05:30 IST