Autorickshaw మెర్సిడెస్ కారును మించిపోయింది...సీఎం షిండే సంచలన tweet
ABN , First Publish Date - 2022-07-06T13:09:27+05:30 IST
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై ప్రస్థుత సీఎం, శివసేన తిరుగుబాటు నాయకుడు ఏకనాథ్ షిండే (Eknath Shinde)విమర్శల వర్షం కురిపించారు....

ఉద్ధవ్ ఠాక్రేపై మహారాష్ట్ర సీఎం Eknath Shinde విమర్శల వర్షం
ముంబయి(మహారాష్ట్ర): మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై ప్రస్థుత సీఎం, శివసేన తిరుగుబాటు నాయకుడు ఏకనాథ్ షిండే (Eknath Shinde)విమర్శల వర్షం కురిపించారు.ఏకనాథ్ షిండే శివసేన పార్టీలో తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్నప్పుడు కొంతమంది సేన నాయకులు ‘ఆటో రిక్షా డ్రైవర్’’ అని అతన్ని అపహాస్యం చేశారు.తన ప్రారంభ రోజుల్లో సీఎం షిండే జీవనోపాధి కోసం ఆటో రిక్షా నడిపారు.ఉద్ధవ్ థాకరే బలపరీక్షకు ముందే సీఎం పదవికి రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత జూన్ 30న షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.గవర్నర్‌కు రాజీనామా సమర్పించేందుకు ఉద్ధవ్ ఠాక్రే మెర్సిడెస్ కారులో రాజ్‌భవన్‌కు వచ్చారు.దీంతో మెర్సిడెస్ కారును ఆటోరిక్షా అధిగమించిందని సీఎం షిండే మరాఠీలో ట్వీట్ చేశారు.
జీవనోపాధి కోసం ఆటోరిక్షా నడిపే తన నిరాడంబరమైన గతాన్ని స్పష్టంగా ప్రస్తావిస్తూ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. ‘‘ఆటోరిక్షా మెర్సిడెస్ కారుని మించిపోయింది.. ఎందుకంటే ఇది సామాన్యుల ప్రభుత్వం’’ అని షిండే ట్వీట్ చేశారు.1990వ దశకం ప్రారంభంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం జరిగిన ఆందోళనలో పాల్గొన్న కరసేవకుల పోరాటాన్ని అభినందించలేని ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య థాకరేను మెర్సిడెస్ బేబీ అని పిలిచి ఫడణవీస్ గతంలో విరుచుకుపడ్డారు.షిండే ప్రభుత్వం విశ్వాస తీర్మానానికి 164 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయడంతో విశ్వాస పరీక్షలో నెగ్గింది.
