ఏటీసీ క్లియరెన్స్‌ లేకుండానే విమానం టేకాఫ్‌

ABN , First Publish Date - 2022-01-03T07:55:51+05:30 IST

ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌(ఏటీసీ) ఎలాంటి అనుమతులు ఇవ్వకున్నా.. స్పైస్‌జెట్‌ విమానం ఒకటి టేకాఫ్‌ తీసుకుంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌..

ఏటీసీ క్లియరెన్స్‌ లేకుండానే విమానం టేకాఫ్‌

న్యూఢిల్లీ, జనవరి 2: ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌(ఏటీసీ) ఎలాంటి అనుమతులు ఇవ్వకున్నా.. స్పైస్‌జెట్‌ విమానం ఒకటి టేకాఫ్‌ తీసుకుంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) విచారణకు ఆదేశించిందని అధికారులు ఆదివారం వెల్లడించారు. గత నెల 30న రాజ్‌కోట్‌ నుంచి ఢిల్లీ వెళ్లే విమానం ఉదయం 9.30 గంటల సమయంలో టేకాఫ్‌ తీసుకుంది. అయితే పైలట్లు ఏటీసీ నుంచి అనుమతుల్ని తీసుకోకుండానే విమానాన్ని గాల్లోకి లేపారని అధికారులు తెలిపారు.

Read more