Ecuador prison: జైలులో మళ్లీ హింసాకాండ...15 మంది మృతి

ABN , First Publish Date - 2022-10-04T18:16:59+05:30 IST

ఈక్వేడేరియన్ నగరమైన లాటాకుంగాలోని జైలులో మళ్లీ హింసాకాండ(Ecuador prison violence) చెలరేగింది....

Ecuador prison: జైలులో మళ్లీ హింసాకాండ...15 మంది మృతి

లాటాకుంగా: ఈక్వేడేరియన్ నగరమైన లాటాకుంగాలోని జైలులో మళ్లీ హింసాకాండ(Ecuador prison violence) చెలరేగింది. జైలులో జరిగిన హింసాకాండలో(prison violence) 15మంది ఖైదీలు మరణించారు. జైలులో జరిగిన ఘర్షణల్లో మరో 21 మంది ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. జైలులో ఉన్న డ్రగ్స్ గ్యాంగుల మధ్య చెలరేగిన ఘర్షణలో 15 మంది మరణించడం సంచలనం రేపింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గత ఏడాది ఈక్వెడార్ జైలులో జరిగిన హింసాకాండలో  316 మంది మరణించారు. జులై 13వతేదీన సంతా డోమింగో జైలులో జరిగిన అల్లర్లలో 43 మంది మరణించారు. 

Read more