MP Badruddin Ajmal: ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ మరోసారి హిందువులపై సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-12-03T07:21:13+05:30 IST
అసోం ఎంపీ,ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ బద్దుద్దీన్ అజ్మల్ మరోసారి హిందువులపై వివాదాస్పద షాకింగ్ వ్యాఖ్యలు చేశారు....
అక్రమ సంబంధాల వల్లే ఆలస్యంగా పెళ్లి చేసుకుంటారు...
న్యూఢిల్లీ: అసోం ఎంపీ,ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ బద్దుద్దీన్ అజ్మల్ మరోసారి హిందువులపై వివాదాస్పద షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.(Assam MP Badruddin Ajmal) హిందూ పురుషులు((Hindu Men) అక్రమ సంబంధాలు(Illegal Relations) పెట్టుకోవడం వల్లనే ఆలస్యంగా వివాహాలు చేసుకుంటున్నారని ఎంపీ అజ్మల్ వ్యాఖ్యానించారు.
‘‘హిందువులు 40 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటారు.. ఇంత ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే పిల్లలు ఎలా పుడతారు..(Marry Late) సారవంతమైన భూమిలో విత్తనాలు నాటితే మంచి ఫలితాలను ఆశించవచ్చు. ముస్లింలు ఎలా వివాహం చేసుకుంటారో అదే ఫార్ములాను హిందువులు కూడా అనుసరించాలి’’ అని అజ్మల్ సూచించారు.
ముస్లిం పురుషులు 21 ఏళ్ల వయసు నిండిన వెంటనే వివాహం చేసుకుంటారని, హిందూ పురుషులు ముగ్గురు మహిళలతో అక్రమ సంబందాలు పెట్టుకొని 40 ఏళ్ల వరకు అవివాహితులుగా ఉంటారని ఎంపీ వ్యాఖ్యానించారు.హిందువులకు ఈ రోజుల్లో పిల్లలు తక్కువగా ఉండటానికి ఇదే కారణం అని ఆయన అన్నారు.హిందువులు 40 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటారని, ఇంత ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే పిల్లలు ఎలా పుడతారని ఆయన ప్రశ్నించారు.
హిందూ బాలికలు 18-20 సంవత్సరాల వయస్సులో పురుషులను వివాహం చేసుకుంటే, వారికి మంచి సంఖ్యలో పిల్లలు పుడతారని ఆయన అన్నారు. ఎంపీ అజ్మల్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయ