High Court of Karnataka : భార్య ప్రియుడి సెల్‌ఫోన్‌ సమాచారం కోరడం వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమే

ABN , First Publish Date - 2022-12-15T03:10:53+05:30 IST

భార్య వివాహేతర సంబంధాన్ని నిరూపించే క్రమంలో మూడో వ్యక్తి గోప్యతకు భంగం కలిగించడాన్ని అనుమతించబోమని కర్ణాటక హైకోర్టు

High Court of Karnataka : భార్య ప్రియుడి సెల్‌ఫోన్‌ సమాచారం కోరడం వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమే

బెంగళూరు, డిసెంబరు 14: భార్య వివాహేతర సంబంధాన్ని నిరూపించే క్రమంలో మూడో వ్యక్తి గోప్యతకు భంగం కలిగించడాన్ని అనుమతించబోమని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. ఇది ఆ వ్యక్తికి రాజ్యాంగం కల్పించిన గోప్యతా హక్కుకు భంగం కలిగించడమేనని హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఎం నాగప్రసన్న వ్యాఖ్యానించారు. తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ 37 ఏళ్ల మహిళ 2018లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. కేసు విచారణ సందర్భంగా తన భార్యకు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని ఆమె భర్త ఆరోపించాడు. ఆమె ప్రియుడి సెల్‌ఫోన్‌ సమాచారాన్ని పరిశీలించాలని కోరాడు. అయితే ఆ మహిళ ప్రియుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి.. తన ఫోన్‌కాల్స్‌ వివరాలను కోరడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు.. భార్యాభర్తల విడాకుల కేసులో మూడో వ్యక్తి గోప్యతకు భంగం కలిగించడాన్ని అనుమతించబోమని పేర్కొంది.

Updated Date - 2022-12-15T03:10:55+05:30 IST