మాకు ‘అరుణాచల్’ బాలుడు దొరికాడు: చైనా
ABN , First Publish Date - 2022-01-24T06:46:05+05:30 IST
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన బాలుడు తమకు దొరికాడని చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ఆదివారం భారత సైన్యానికి తెలిపింది. ..

న్యూఢిల్లీ, జనవరి 23: అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన బాలుడు తమకు దొరికాడని చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ఆదివారం భారత సైన్యానికి తెలిపింది. మీరం టారోన్ అనే బాలుడిని ఎగువ సియాంగ్ జిల్లా నుంచి ఈ నెల 18న చైనా బలగాలు అపహరించాయని అరుణాచల్‌కు చెంది న పార్లమెంటు సభ్యుడు టాపిర్ గావో ఇటీవల ఆరోపించారు. దీంతో అతడి జాడ కోసం భారత సైన్యం పీఎల్ఏ సహకారాన్ని కోరింది. ఈ క్రమం లో బాలుడిని కనుగొన్నామని, అతడిని భారత సైన్యానికి అందించే ప్రయత్నాలు ప్రారంభించామని పీఎల్ఏ పేర్కొంది.