Arif Mohammad Khan: బంగారం స్మగ్లింగ్‌పై జోక్యం చేసుకుంటా!

ABN , First Publish Date - 2022-11-04T04:40:36+05:30 IST

కేరళలో సంచలనం రేపిన బంగారం స్మగ్లింగ్‌ వివాదంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ లక్ష్యంగా చేసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలను విజయన్‌ కార్యాలయం ప్రోత్సహిస్తోందని గురువారం ఆయన ఆరోపించారు.

Arif Mohammad Khan: బంగారం స్మగ్లింగ్‌పై  జోక్యం చేసుకుంటా!
Arif Mohammad Khan

కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

తిరువనంతపురం, న్యూఢిల్లీ, నవంబరు 3: కేరళలో సంచలనం రేపిన బంగారం స్మగ్లింగ్‌ వివాదంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ లక్ష్యంగా చేసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలను విజయన్‌ కార్యాలయం ప్రోత్సహిస్తోందని గురువారం ఆయన ఆరోపించారు. గురువారం ఢిల్లీలో ఆరిఫ్‌ విలేకరులతో మాట్లాడుతూ ‘స్మగ్లింగ్‌ కార్యకలాపాలన్నీ సీఎంవో నుంచే జరిగినట్టు నాకు కనిపిస్తోంది. సీఎంవో, సీఎం సన్నిహితుల ప్రమేయం ఉంటే గనుక నేను తప్పక జోక్యం చేసుకుంటాను’ అన్నారు. చట్ట ప్రకారం తాను చేయాల్సిందంతా చేస్తానని స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-04T04:40:37+05:30 IST