తరలింపును వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2022-03-05T08:04:49+05:30 IST

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను స్వదేశానికి తరలించడానికి వేగవంతంగా చర్యలు తీసుకోవాలని...

తరలింపును వేగవంతం చేయండి

 కేంద్రానికి ఎంపీ కనకమేడల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను స్వదేశానికి తరలించడానికి వేగవంతంగా చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఈ ేురకు బుధవారం ఆయన ఢిల్లీలో విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సంజయ్‌ వర్మకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌, హెల్ప్‌లైన్‌ నంబర్ల ద్వారా సేకరించిన తెలుగు సహా ఇతర విద్యార్థుల వివరాలను విదేశాంగ శాఖకు అందజేశామని తెలిపారు. ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాల్లో టీడీపీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌లు పనిచేస్తున్నాయన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అధైర్య పడవద్దని కోరారు. విద్యార్థుల తరలింపుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. కాగా, విద్యార్థుల వివరాలను సేకరించి, కేంద్రంతో సమన్వయం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. 

Updated Date - 2022-03-05T08:04:49+05:30 IST