దేశ వ్యాప్తంగా NIA, ED మరో సంయుక్త ఆపరేషన్..

ABN , First Publish Date - 2022-09-27T15:26:57+05:30 IST

పీఎఫ్ఐ సంస్థ (PFI Firm)తో సంబంధం ఉన్న సభ్యులు, కార్యాలయాలపై.. కేంద్ర జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

దేశ వ్యాప్తంగా NIA, ED మరో సంయుక్త ఆపరేషన్..

Delhi : పీఎఫ్ఐ సంస్థ (PFI Firm)తో సంబంధం ఉన్న సభ్యులు, కార్యాలయాలపై.. కేంద్ర జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరో సంయుక్త ఆపరేషన్ నిర్వహించింది. 8 రాష్ట్రాల్లో సంయుక్తంగా దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ (Uttarapradesh), మధ్యప్రదేశ్ (Madyapradesh), పంజాబ్ (Punjab), ఢిల్లీ (Delhi), కేరళ (Kerala), గుజరాత్ (Gujarath), కర్ణాటక (Karnataka), అస్సోం (Assam)లో దాడులు నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. ఇవాళ్టి ఆపరేషన్‌లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (Central Intelligence Agency), రాష్ట్ర పోలీసులు కూడా.. కొన్ని చోట్ల తనిఖీల్లో పాల్గొంటున్నట్లు ఎన్ఐఏ కేంద్ర కార్యాలయం (NIA Central office) వెల్లడించింది. రెండు వారాల్లో మూడోసారి దేశంలో పీఎఫ్ఐ కార్యకలాపాలపై.. ఎన్ఐఏ, ఇతర దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహిస్తున్నాయి. 

Read more