వచ్చే ఏడాది అదనంగా 64 వేల హెచ్‌-2బీ వీసాలు

ABN , First Publish Date - 2022-12-15T03:08:25+05:30 IST

దేశంలోని కార్మిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2023 ఆర్థిక సంవత్సరంలో 64,716 అదనపు హెచ్‌-2బీ వీసాలను జారీ చేసేందుకు ..

వచ్చే ఏడాది అదనంగా 64 వేల హెచ్‌-2బీ వీసాలు

వాషింగ్టన్‌, డిసెంబరు 14: దేశంలోని కార్మిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2023 ఆర్థిక సంవత్సరంలో 64,716 అదనపు హెచ్‌-2బీ వీసాలను జారీ చేసేందుకు అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా పౌరసత్వ-వలన సేవల సంస్థ(యూఎ్‌ససీఐఎస్‌) ఒక ప్రకటనలో తెలిపింది. వ్యవసాయేతర అవసరాల కోసం విదేశీ కార్మికులను అమెరికా సంస్థలు తాత్కాలికంగా నియమించుకునేందుకు హెచ్‌-2బీ వీసా వీలు కల్పిస్తుంది. ఈ వీసాను భారతీయులెవరూ పెద్దగా ఎంచుకోని నేపథ్యంలో ఈ నిర్ణయం తాలూకు ప్రభావం భారత్‌కు అంతగా ఉండదని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2022-12-15T03:08:27+05:30 IST